ప్రతీ విద్యార్ధి ఏకాగ్రతతో చదివి, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు వ్రాయాలి – ఆశాజ్యోతి

తణుకు సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ నందు ఆదివారం డిస్టిక్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు ఆశాజ్యోతి ఆధ్వర్యంలో కెరియర్ గైడెన్స్ ప్రోగ్రాం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పరీక్షలు ఎంతోముఖ్యమైనవి అని, ప్రతీ విద్యార్ధి ఏకాగ్రతతో చదివి, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు వ్రాయాలని అన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఎగ్జామ్స్ రాసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు పరీక్ష రాసే విధానంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆదరణ సేవా ఫౌండేషన్ సహకారంతో విద్యార్థులకు పరీక్షకు అవసరమైన సామాగ్రి స్టేషనరీ కిట్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ సిబ్బంది జీ.ఫణికుమార్, ఆర్.రామకృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link