:- మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు క్యాంపు కార్యాలయంలో 26 మంది లబ్ధిదారులకు రూ.29.45 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ వోసీల పంపిణీ
నిడదవోలు నియోజకవర్గంలో ఇప్పటివరకు 635 మందికి రూ. 4.85 కోట్ల లబ్ధి చేకూర్చామని వెల్లడి
సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి దుర్గేష్ లకు కృతజ్ఞతలు తెలిపిన బాధిత లబ్ధిదారులు
నిడదవోలు: నిరుపేదల ఆరోగ్య భద్రతే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆదివారం నిడదవోలులోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 26 మంది లబ్ధిదారులకు రూ. 29,45,512 విలువైన చెక్కులు, ఎల్ వోసీ పత్రాలను ఆయన పంపిణీ చేశారు. అందులో 25 మందికి రూ. 28,83,778 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను, ఒకరికి రూ. 61,734 విలువైన ఎల్ వోసీ పత్రాన్ని మంత్రి దుర్గేష్ స్వయంగా అందజేశారు. నిడదవోలు నియోజకవర్గంలో ఇప్పటివరకు సీఎంఆర్ఎఫ్, ఎల్ వోసీ మరియు ప్రత్యేక ఆర్థిక సాయం కింద మొత్తం 635 మందికి రూ. 4,85,87,498 లబ్ధి చేకూర్చామని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ సీఎం చంద్రబాబునాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా ‘హెల్దీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్’ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.”ఆరోగ్యం ఉంటేనే సంపద ఉంటుంది, అప్పుడే సమాజం సంతోషంగా ఉంటుంది. అందుకే ప్రస్తుత బడ్జెట్‌లో ఆరోగ్య శాఖకు సుమారు రూ. 19,000 కోట్లు కేటాయించడం జరిగింది. 863 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది.” అని మంత్రి దుర్గేష్ వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దరఖాస్తు చేసుకున్న తక్కువ కాలంలోనే నిధులు విడుదలయ్యేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ప్రజల కోసం ఇంత చేస్తున్న ప్రధాని మోదీని, సీఎం చంద్రబాబునాయుడుని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కూటమి ప్రభుత్వాన్ని ప్రజలంతా ఆశీర్వదించాలన్నారు. మంచి కార్యక్రమాల్లో ప్రజలు కూడా భాగస్వామ్యులై ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. తద్వారా మనల్ని, సమాజాన్ని బాగు చేసుకొందామని పిలుపునిచ్చారు.
వైద్య ఖర్చుల భారం నుంచి గట్టెక్కించినందుకు లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేట్ స్థాయి వైద్యం పేదలకు ఉచితంగా అందేలా చేస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


