తణుకు డిపో గారేజ్ ఆవరణలో కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాల 4 వ వారం, మరియు బంపర్ డ్రా కార్యక్రమం నిర్వహించారు. నూతన డిపో మేనేజర్ సుధారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం కు నూతన ప్రజా రవాణాధికారి సప్పా గిరిదర్ కుమార్ ముఖ్య అతిధి గా విచ్చేసి విజేతలను ప్రకటించారు. 3 వారం విజేతలకు బహుమతులు అందించారు. అనంతరం నూతనం గా జిల్లా ప్రజారవాణాధికారిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన సప్పా గిరిధర్ కుమార్ గారికి మరియు నూతనంగా డిపో మేనేజర్ గా బాధ్యతలు చేపట్టిన సుధారాణి గారికి అన్ని యూనియన్ల నాయకులు సభ్యులు, ఆఫీస్ సిబ్బంది గ్యారేజ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది, మరియు కార్గో సిబ్బంది ఘనంగా సన్మానించారు. కార్గో డోర్ డెలివరీ మహోత్సవాలలో అత్యధిక బుకింగ్లు చేసిన లావణ్య ఫీడ్స్ ప్రోప్రైటర్ కోసూరి సతీష్ వర్మ గారిని డి పి టీ ఓ మరియు డిపో మేనేజర్ లు, మేమేంటో అందించి.ఘనంగా సత్కరించారు. డోర్ డెలివరీ మాసోత్సవాలలో రీజియన్లో అత్యధిక బుకింగ్లు చేసిన కార్గో డిఎంఈ షేక్ లాల్ ని కార్గో సిబ్బందిని అభినందించారు. నాలుగు వారాలు మరియు బంపర్ డ్రా బంపర్ డ్రాలకు బహుమతులు స్పాన్సర్ చేసిన నరేష్ క్లాత్ షోరూం మరియు షాలేం పెన్ కార్నర్ మరియు డాక్టర్ టిపిఎన్ ప్రసాద్ అనూష ల గారికి అభినందనలు తెలియజేశారు.


