లేబర్ కోడ్స్ రద్దు కోరుతూ ఈనెల 12న దేశవ్యాపిత సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలి…

తణుకు, ఫిబ్రవరి 3
కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లు రద్దు కోరుతూ ఈనెల 12 కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాపిత సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని ఉద్యోగ, కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది.సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం ఉద్యోగ,కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం స్థానిక అమరవీరుల భవనంలో జరిగింది.

ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులను కట్టు బానిసలను చేస్తూ కార్పోరేట్లు, పెట్టుబడి దారులకు అనుకూలంగా 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తేవడం జరిగిందన్నారు.ఈ లేబర్ కోడ్స్ రద్దు కోరుతూ దేశ వ్యాపితంగా జరుగుతున్న సమ్మెలో 10 కేంద్ర కార్మిక సంఘాలు,సంయుక్త కిసాన్ మోర్చా,520 కు పైగా స్వతంత్ర సంఘాలు పాల్గొంటున్నాయన్నారు.కార్మికుల జీవించే హక్కును హరించే లేబర్ కోడ్ లు రద్దు కోరుతూ జరుగుతున్న సమ్మె విజయవంతం చేయాలని భీమరావు కోరారు.

సీఐటీయూ జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ మాట్లాడుతూ లేబర్ కోడ్స్ కారణంగా కార్మికులు సంఘాలు పెట్టుకునే హక్కు కోల్పోవడంతో పాటు వేతనాలు పొందే హక్కు,8 గంటల పనిహక్కు పోయి 12 గంటల పని అమలులోకి వస్తుందన్నారు.కార్మికులను కట్టుబానిసలను చేసే లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు కార్మికులు సంఘటిత పోరాటాలకు సమాయత్తం కావాలన్నారు.

ఈసమావేశంలో సమ్మె వాల్ పోస్టర్ ఆవిష్కరించారు.సమ్మె విజయవంతం కోరుతూ ఈనెల 9 న బైక్ ర్యాలీ నిర్వహించాలని, సమ్మె రోజు ఫిబ్రవరి 12 న ఉదయం 9 గంటలకు తణుకు శ్రీచిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద నుంచి కార్మిక ప్రదర్శన,మున్సిపల్ కార్యాలయం వద్ద సభ నిర్వహించాలని సమావేశం తీర్మానించింది.

ఏఐటీయూసీ,సీఐటీయూ నాయకులు బొద్దాని నాగరాజు,అడ్డగర్ల అజయకుమారి,గుబ్బల గోపి,బళ్ళ చిన వీరభద్రం, పిఎల్ నరశింహారావు,మందుల ముత్తయ్య,ఎం.రమేష్, దక్షిణామూర్తి,శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link