మార్చి 14న తణుకులో జాతీయ లోక్ అదాలత్

గౌరవ చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి డి.సత్యవతి పత్రిక ప్రకటన ద్వారా 2026 సంవత్సరానికి గాను మొదటి జాతీయ లోక్ అదాలత్ ది.14.3.2026 వ తేదీన రాష్ట్రములో కోర్టులు పనిచేయు ప్రతి చోట నిర్వహిస్తున్నారు, దానిలో భాగంగా తణుకు కోర్టు లో కూడా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు, దానిలో రాజీ పడు క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ప్రోనోటు బకాయి కేసులు, మోటారు వాహనాలు ప్రమాదాల కేసులు, భార్య భర్తల కుటుంబ తగాదా కేసులు, మనోవర్తి కేసులు, డొమెస్టిక్ వయోలెన్సుకేసులు, బ్యాంకు ఋణ బకాయి కేసులు, అన్ని రకాల సివిల్ కేసులు రాజీ చేసుకోవచ్చు, చిన్న చిన్న తగాదా విషయాలలో కేసులు రాజీ చేసుకుని విలువైన సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలని, ప్రతి రోజు కేసులు ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ ద్వారా, మీడియేషన్ కౌన్సెలింగ్ ద్వారా కేసులు రాజీ చేసుకోవచ్చని, జాతీయ లోక్ అదాలత్ లో కేసులు రాజీ చేసుకొనుటకు న్యాయవాదులు, పోలీసు అధికారులు, కోర్ట్ సిబ్బంది మరియు మండల న్యాయ సేవల కమిటీ తణుకు సిబ్బందిని సంప్రదించి తెలుసుకోవచ్చని, జాతీయ న్యాయ సేవల సంస్థ ఢిల్లీ వారి టోల్ ఫ్రీ నెంబర్ 15100 కి ఫోన్ చేసి జాతీయ లోక్ అదాలత్ గురించి తెలుసుకోవచ్చని తెలిపారు.మరియు ప్రీ లిటిగేషన్ కేసులుగా బ్యాంకు ఋణ బకాయి కేసులు, టెలిఫోన్ బిల్లు బకాయి కేసులు కూడా ఈ జాతీయ లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవచ్చని, ఈ అవకాశాన్ని కేసులు వున్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని విలువైన సమయాన్ని డబ్బును ఆదా చేసుకోవాలని గౌరవ చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి, తణుకు శ్రీమతి డి.సత్యవతి కోరుతున్నారు.

Scroll to Top
Share via
Copy link