గ్రంథాలయ చైర్మన్ నాగరాజుకు తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ శుభాకాంక్షలు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంధాలయ సంస్థ నూతన చైర్మన్ జుత్తుగ నాగరాజును తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అభినందించారు. ఈ మేరకు శనివారం మహదేవపట్నంలోని నాగరాజు నివాసానికి మర్యాదపూర్వకంగా వెళ్లిన ఎమ్మెల్యే రాధాకృష్ణ పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link