ప్రజల సంతృప్తే కూటమి ప్రభుత్వానికి గీటురాయి: మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్

ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందించిన మంత్రి దుర్గేష్

నిడదవోలు పట్టణంలో ప్రతి నెలా రూ..86 కోట్ల పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని వెల్లడి

10వ వార్డులో రజకుల వీధికి వెళ్లి రజకుల ఇళ్లలో బట్టలు ఇస్త్రీ చేసి ఆశ్చర్యపరిచిన మంత్రి దుర్గేష్

నిడదవోలు, జనవరి 31, 2026:ప్రజల సంతృప్తే కూటమి ప్రభుత్వానికి గీటురాయి అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.శనివారం నిడదవోలు పట్టణంలోని 10వ వార్డు రజకుల వీధిలో ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. మంత్రి దుర్గేష్ స్వయంగా ప్రతి ఇంటికీ నడిచి వెళ్లి వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్లను అందజేశారు.పెన్షన్ పంపిణీ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ లబ్ధిదారులతో ఆత్మీయంగా ముచ్చటించారు. అవ్వాతాతల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. పంపిణీ సమయంలో ఎదురైన కొన్ని స్థానిక సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. కొందరికి వ్యక్తిగతంగా ఆర్థిక సాయం అందించి తన ఉదారతను చాటుకున్నారు. ఒక సాధారణ వ్యక్తిలా రజకుల ఇళ్ల వద్దకు వెళ్లి బట్టలు ఇస్త్రీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల చొరవతో పెన్షన్లు పెంచి, ఒక రోజు ముందుగానే ఇంటి వద్దకే అందిస్తున్నామన్నారు. గతంలో రూ. 3,000 వచ్చే పెన్షన్ నేడు రూ. 4,000 కు పెరిగిందని తెలిపారు. ప్రజల సంతృప్తే కూటమి ప్రభుత్వానికి గీటురాయి” అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

నిడదవోలు పట్టణంలో ప్రతి నెలా రూ. 1,86,34,500 ఖర్చుతో 4,181 పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు.ఫిబ్రవరి 2026లో కొత్తగా 6 పెన్షన్లు జతకావడంతో మొత్తం వ్యయం రూ. 1,86,55,000 కు చేరుకుందన్నారు.ప్రస్తుతం పర్యటించిన వార్డులో 101 పెన్షన్ల ద్వారా రూ. 4.88 లక్షలు లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు.ప్రతి నెలా నిరాటంకంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎంలకు ధన్యవాదాలు తెలిపారు.

పెన్షన్ పంపిణీ ద్వారా కూటమి ప్రభుత్వం నిరుపేదలకు బాసటగా నిలవడంతో లబ్దిదారుల మొఖాల్లో కనిపించిన ఆనందం ఎనలేనిది అన్నారు. ఆరోగ్యం, కుటుంబాలు బాగుపడే విధంగా అందిస్తున్న పెన్షన్లు తమకు భరోసాని అందిస్తున్నాయని లబ్ధిదారులు చెప్పడం చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సీఎం , డిప్యూటీ సీఎంలను, ప్రధాని మోదీలను ప్రజలు ఆశీర్వదిస్తున్నారన్నారు.అభివృద్ధి, సంక్షేమం, ప్రజల్లో ఆనందం చూడటానికి కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడుతామని హామీ ఇచ్చారు.

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, మెగా డీఎస్సీ , అన్నదాత సుఖీభవ, యువతకు ఉపాధి కల్పన తదితర సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని మంత్రి దుర్గేష్ వివరించారు.నిడదవోలు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రోడ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తున్నామని తద్వారా రహదారులు బాగు చేస్తున్నామని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న కూటమి నాయకులకు, కార్యకర్తలకు ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు. సంక్షేమ పథకాల అమల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే ముందంజలో ఉందని ఆయన స్పష్టం చేశారు.

Scroll to Top
Share via
Copy link