వాల్పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ నాగరాణి
ప్రపంచ క్యాన్సర్ డే పురస్కరించుకుని ఈనెల 3న తణుకులో ఉచిత క్యాన్సర్ నిర్థారణ, పరీక్ష శిబిరం ఏర్పాటు చేసినట్లు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (డీవీఎంసీ) సభ్యురాలు జి.ఆశాజ్యోతి తెలిపారు. విజయవాడకు చెందిన మణిపాల్ హాస్పటల్, తణుకు ఎస్కేఎస్డీ మహిళా కాళాశాల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మహిళా కళాశాల ఆవరణలో ఆరిమిల్లి కృష్ణతులసి సహకారం తో ఈ శిబిరం జరుగుతుందన్నారు. ఈ శిబిరంలో మామోగ్రఫీ, పాప్స్మియర్ పరీక్షలు ఉచితంగా చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి ఎన్.వి.అరుణకుమారి, మోటివేషనల్ స్పీకర్ ఆరిమిల్లి కృష్ణతులసి హాజరవుతారని చెప్పారు. ఈ మేరకుశనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శిబిరానికి సంబంధించిన వాల్పోస్టర్ను జిల్లా కలెక్టర్ నాగరాణి ఆవిష్కరించినట్లు ఆశాజ్యోతి వివరించారు.


