భీమవరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన డి ఆర్ సి సమీక్షా సమావేశంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా ఇన్చార్జి మంత్రి, ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, భారీ నీటి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై మాట్లాడారు. వివిధ శాఖల ప్రభుత్వాధికారులతో కలిసి ఈ సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు.


