అంబటి రాంబాబు వ్యాఖ్యలు అత్యంత హేయం – బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి: మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరిక

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, అంబటి రాంబాబు తీరుపై నిప్పులు చెరిగారు.

ముఖ్యమంత్రి జోలికొస్తే సహించేది లేదు*

“ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోలికొస్తే తాట తీస్తాం. అంబటి రాంబాబు నీది మనిషి జన్మేనా? ఒక ఆంబోతులా ప్రవర్తిస్తూ రోడ్డు మీద పడి నీచమైన మాటలు మాట్లాడితే ప్రజలు తోలు తీయడం ఖాయం” అని మంత్రి దుర్గేష్ హెచ్చరించారు. రాజకీయాల్లో విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి తప్ప, వ్యక్తిగత దూషణలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

వైసీపీ బూతుల సంస్కృతిపై ఫైర్

*11 సీట్లకు పరిమితమైనా బుద్ధి రాలేదు:

గతంలో నోరు పడేసుకున్నందుకే ప్రజలు వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారని, ఓడిపోయినా అంబటి రాంబాబుకు సిగ్గు రావడం లేదని మండిపడ్డారు. అంబటి రాంబాబు ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నారని, ఇప్పటివరకు సహనంతో భరించామని, ఇకపై నిజమైన సినిమా చూపిస్తామని మంత్రి దుర్గేష్ వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో వైసీపీ మళ్ళీ బూతుల సంస్కృతిని తెరపైకి తెస్తూ రాజకీయాన్ని కలుషితం చేస్తోందని, గొడవలు, హత్యలకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అంబటి రాంబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అంబటిని రాజకీయాల నుంచి బహిష్కరించాలని, వైసీపీ ఆయనను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.అంబటి తన నోరు అదుపులో పెట్టుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

“గతంలో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబునాయుడు కుటుంబాన్ని అవమానించిన చరిత్ర అంబటిది. మీరు చేసిన పాపాలను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక ఇలాంటి నీచవ్యాఖ్యలు చేయడం అత్యంత హేయం” అని మంత్రి దుర్గేష్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

Scroll to Top
Share via
Copy link