మహాత్మాగాంధీ వర్థంతి – ఎమ్మెల్యే రాధాకృష్ణ నివాళులు

మహాత్మాగాంధీ వర్థంతి కార్యక్రమాన్ని శుక్రవారం తణుకులో కూటమి నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించారు. తణుకు రాష్ట్రపతిరోడ్డు కోర్టు ఎదురుగా మహాత్మాగాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆంగ్లేయుల ప్రభుత్వ విధానాలను తుద ముట్టించి దేశ ప్రజలకు స్వేచ్ఛ, సౌబ్రాతృత్వాన్ని పంచి జాతిపితగా ఆయ్యారని ఎమ్మెల్యే అన్నారు. ఆయన చూపించిన అహింసా మార్గంలో ప్రతిఒక్కరు నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link