ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని ఆలోచన విరమించుకోకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఇరగవరం మండలం సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కామన మునిస్వామి అన్నారు .గురువారంనాడు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఎర్రాయి చెరువు, పొదలాడ, రేలంగి, కొత్తపాడు, ఇరగవరం తూర్పు విప్పరు గ్రామలలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపును అనుసరించి ఉపాధి హామీ కార్మికుల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహలు వద్ద ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మునిస్వామి మాట్లాడుతూ జి రామ్ జి పేరుతో కొత్త చట్టాన్ని తీసుకుని వచ్చారని గతంలో ఉన్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మార్పు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని నిలుపుదల చేయాలని పాత చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో వంద రోజులు పని కల్పిస్తానని చట్టం చెబుతున్న 50 రోజులే ఉపాధి కల్పించారని ఇప్పుడు కొత్త చట్టo పరికారం 125 రోజులు పని దినాలు లని ప్రకటిస్తూ 60 రోజులు పని కల్పించమని చట్టంలో తెలియజేశారని ఇది దుర్మార్గమైన చర్యని అని అన్నారు. కార్మికులు వలసకు పోకుండా కాపాడే ఉపాధిహామీ ఈ చట్టాన్ని మార్పు పేరుతో కార్మికుల పొట్టను కొట్టి పస్తులతో కాలం గడిపే విధం
ఈ చట్టం ఉండదని మునిస్వామి అన్నారు. గ్రామంలో రైతులకు సన్నకారు రైతులకు ప్రయోజనం కలిగే ఈ చట్టం నిరుద్యోగులకు ఉపాధి కలిగించే చట్టం మార్పు చేయకూడదని డిమాండ్ చేశారు. గతంలో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు తో పనులు నిర్వహించే వారిని ఇప్పుడూ
60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం అంటూ రాష్ట్రాలపై నాలుగువేల కోట్ల రూపాయలు
ఆర్థిక బరాన్ని వేసారని వీటిని అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వాలకు సాధ్యం కాదని కేవలం ఈ పథకాన్ని నీరు కార్చుటకు మార్పు చేశారని మునుస్వామి అన్నారు. పాత చట్టం అమలు జరిగే వరకు కార్మికులు పోరాడుతారని మునుస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు జుత్తిగ రామాంజనేయులు ,కేత మహాలక్ష్మి పాల సీతమ్మ ,తెచ్చేటి సుభద్ర ,
కేత శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


