తణుకు మున్సిపల్ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహం నుంచి కలశాలతో శాంతి ర్యాలీను ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ బౌద్ధ మతం అనేది ధర్మానికి ప్రతీక అనే ప్రతి ఒక్కరు ధర్మాన్ని పాటిస్తూ, ధర్మాన్ని పాటించి ఆచరించాలని కోరారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బుద్దుడిని తన మొదటి గురువుగా భావించి సమానత్వం ఉండాలని సమ సమాజ నిర్మాణం జరగాలని తెలియజేసిన అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడుచు కోవాలని సూచించారు. అంబేద్కర్ పాటించిన చిన బౌద్ధమతం అనేక కులాలు, మతాలకు అతీతంగా సమాజ నిర్మాణం జరిగే విధంగా బుద్దుడి బోధనలను అనుసరించాలని కోరారు. గయలో ఉన్న బౌద్ధ దేవాలయాన్ని పోలిన దేవాలయాన్ని ఉండ్రాజవరంలో నిర్మించడం అభినందనీయమన్నారు. దీని ద్వారా టూరిజం మరింత అభివృద్ధి అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఉండ్రాజవరం బౌద్ధపీఠం వరకు 130 మీటర్లు బౌద్ధ జెండా ఊపి ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా బౌద్ధ ఆలయాన్ని నిర్మించి గౌతమబుద్దుడు బోధించిన శాంతి, క్షమాగుణంతోపాటు ప్రతి ఒక్కరి శాంతి, సమానత్వంతో మెలగాలనే బోధనలను ఆదర్శంగా తీసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఉండ్రాజవరం గ్రామసర్పంచి గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శాంతి ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, ఉండ్రాజవరం మండలం టిడిపి అధ్యక్షుడు సింహాద్రి రామకృష్ణ, చివటం పిఎసిఎస్ అధ్యక్షులు ముళ్లపూడి పాండురంగ తదితరులు పాల్గొన్నారు.


