విశాఖపట్నం: జనవరి 8 (కోస్టల్ న్యూస్)
రాష్ట్రంలోని యువతలో శారీరక దృఢత్వం మరియు క్రీడల పట్ల ఆసక్తిని పెంచేందుకు ఏటా నిర్వహించే మిస్టర్ ఆంధ్రా పోటీలు ఈసారి 9వ వసంతంలోకి అడుగుపెట్టాయి. వచ్చే నెల 23న విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో జరగబోయే ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల నుంచి 400మంది బాడీ బిల్డర్లు పాల్గొంటారని అని ఏపీ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈశ్వర రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాడపల్లి శ్రీనివాస్ రాజు తెలిపారు..
విశాఖ వేదికగా వచ్చే నెల 23న శివ వైజాగ్ బౌన్సర్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు జరగనున్నాయి దీనికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం బీచ్ రోడ్డు లో ఒక ప్రైవేట్ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన వాడపల్లి శ్రీనివాస్ రావు, అధ్యక్షులు ఈశ్వర రావు లు మీడియా సమావేశంలో మాట్లాడుతూ గురజాడ కళాక్షేత్రంలో సాయంత్రం 5 గంటల నుండి ఈ పోటీలు ప్రారంభమవుతాయని వారు వెల్లడించారు. ఈ మెగా ఈవెంట్లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి సుమారు 400 మంది క్రీడాకారులు పాల్గొని తమ దేహదారుఢ్యాన్ని ప్రదర్శించనున్నారని తెలిపారు… మొత్తం 10 విభాగాలలో (ఈ పోటీలు నిర్వహించబడతాయి. ప్రతి విభాగంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతులు అందజేస్తారు మొదటి బహుమతి రూ. 5,000, ద్వితీయ బహుమతి రూ. 3,000, తృతీయ బహుమతి రూ. 2,000 చొప్పున అందజేస్తారన్నారు..అన్ని విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ‘ఓవరాల్ ఛాంపియన్స్’గా ఎంపిక అయున వారికీ మొదటి బహుమతిగా రూ. 1,00,000, (ఒక లక్ష రూపాయలు)రెండవ బహుమతి రూ 50,000, మూడవ బహుమతి: రూ. 25,000 అందజేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణలో అసోసియేషన్ ప్రతినిధులు ఎస్. రాజారావు, బి. కోటిరెడ్డి, ఎస్. బాబి తదితరులు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శివ వైజాగ్ బౌన్సర్ ఫౌండర్ శివ మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు బాడీ బిల్డింగ్ రంగానికి గుర్తింపు తీసుకువచ్చేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని ఏపీ వ్యాప్తంగా ఉన్న బాడీ బిల్డర్స్ పాల్గొనాలని క్రీడాభిమానులు అందరూ తరలివచ్చి ఈ పోటీలను విజయవంతం చేయాలని వారు కోరారు.
ఈ సందర్భంగా బాడీ బిల్డింగ్ విన్యాసాలు ప్రదర్శించారు.


