ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవల సంస్థ గుంటూరు వారి ఉత్తర్వులు మేరకు, చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి, తణుకు డి. సత్యవతి ఆదేశముల మేరకు సీనియర్ న్యాయవాదులు కౌర్ వెంకటేశ్వర్లు, స్కూల్ హెడ్మాస్టార్ రాధకృష్ణ, పారా లీగల్ వాలంటీర్ లు దూలపల్లి బ్రహ్మాజీ, కాకర్ల నరసన్న జాతీయ యువజనోత్సవాలలో భాగంగా పిల్లలకు మాదక ద్రవ్యాలు (డ్రగ్స్) వాడకం వాటి పరిణామాలు గురించి తెలియచేస్తూ, యువత చెడు వ్యసనాలకు బానిసైన మత్తు పదార్థాలు సేవించటం, అమ్మటం, రవాణా చేయటం జరుగుతుందని, ఇదీ చట్ట వ్యతిరేక కార్యక్రమము, ఎంతో మంది అక్రమ ఆర్జన కోసం గంజాయి, కొకైన్ పంటలు పండించటం, దానిని ప్రొఫెషనల్ కళాశాలలో అమ్మి పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారని, అలాగే ప్రతి కుటుంబంలో తండ్రి చెడు అలవాట్లుకు లోనైతే అనగా మత్తు పదార్థాలు సేవించటం వలన కుటుంబం కుటుంబం మొత్తం నాశనమవుతుందని, ఆడ, మగ పిల్లలు హైస్కూల్ స్థాయి నుండి చట్టాలపై అవగాహన కలిగి జీవించాలని, యువతను పాడు చేయుటకు కొన్ని డ్రగ్స్ గ్యాంగ్ లు గంజాయి, కొకైన్ వివిధ రూపాలలో తయారు చేసి అక్రమంగా అమ్మి యువత జీవితాలతో ఆడుకుంటున్నారని, సమాజాన్ని నాశనం చేస్తున్నారని, చదువుకునే యువత కొంత అవగాహనతో పర్యావరణాన్ని కాపాడుకోవడానికి తమ వంతు కృషి చేస్తున్నారని, అలాగే మాదక ద్రవ్యాలను నిర్మూలించడానికి కూడా కృషి చేసి డ్రగ్స్ రహిత సమాజాన్ని నెలకొల్పాలని, అలాగే బాల్య వివాహాలను, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలని ప్రతి విద్యార్థి ట్రాఫిక్ రూల్స్ తెలుసుకుని వయసు రాకుండా మోటారు వాహనాలు నడుపకూడదని తెలిపారు.


