కనుమరుగవుతున్న భారతీయ సంస్కృతి సంప్రదాయాలు భావితరాలకు అందించాలి

శ్రీ తారకపురి  లయన్స్ క్లబ్,  తణుకు లయన్స్ క్లబ్  సంయుక్తంగా  గెట్ మెంబర్ వావిలాల సరళాదేవి  ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు కార్యక్రమాన్ని ఘనంగానిర్వహించారు.
 ఈ  సంక్రాంతి సంబరాలు తణుకు లయన్స్ క్లబ్  ఆవరణ నందు హాలు నందు రంగ రంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా లయన్స్ ఇంటర్నేషనల్ రాష్ట్ర చైర్మన్ మేకా శ్రీరామ్ సురేష్. ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ ఎమ్. ఉపేంద్ర, డైరెక్టర్ పర్వతనేని సుభాష్ బాబు, జిల్లా గవర్నర్ ఎన్. వి. వి. ఎస్. పాపారావునాయుడు, సెకండ్ వైస్ గవర్నర్ సెకండ్ వైస్ గవర్నర్ డాక్టర్ డి సుబ్బారావు అదేవిదంగా ఈ సంక్రాంతి సంబరాల్లో అనేకమంది జిల్లా నాయకులు తణుకు  లయన్స్ క్లబ్ మెంబర్స్ పాల్గొన్నారు.
 ఈ సందర్భంగా సరళ దేవి  మాట్లాడుతూ గత 18 సంవత్సరముల నుండి ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని, పాశ్చ్యాత్య పొకడలకు దగ్గరవుతూ, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు భావితరాలకు అందించాలి అనే సత్సంకల్పంతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం పిల్లలకు అవగాహన కల్పించడానికి, సంక్రాంతి సమయంలో మనం చేసే సంస్కృతి కార్యక్రమాల్ని అన్ని నిర్వహిస్తూ సాంప్రదాయ వస్తు వేషధారణలు, వివిధ రకాల సంక్రాంతికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థిని విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తూ ప్రోత్సహిస్తున్నామని సరళాదేవి అన్నారు. భోగి, సంక్రాంతి విలువలను సంస్కృతిలోని అర్థాలను నేటి యువత తెలుసుకోవాలని, పెద్దల ఆచరిస్తూ పిల్లలకి ఈ విషయాలను తెలియజేయాలని సరళాదేవి అన్నారు.
ముగ్గుల పోటీలు, వంటలు పోటీలు చిన్నారులకు, విద్యార్థులకు విద్యార్థిని విద్యార్థులకు సాంప్రదాయ వేషధారణ, గొబ్బెమ్మలు మంట పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. గాలిపటాలు మెహందీ చిన్నారులకు భోగి పళ్ళు గొబ్బెమ్మల పాటలు భోగిమంటలు విచిత్ర వేషధారణలు కోడిపుంజులతో ఆటలు, గంగిరెద్దుల విన్యాసాలు వంటి కార్యక్రమాలతో ఎంతో కన్నుల పండగగా ఈ సంబరాలు నిర్వహించారు.
ఈ ఉత్సవాల్లో పాల్గొన్న ఇంటర్నేషనల్ నాయకులు మాట్లాడుతూ ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి సంబరాలు నిర్వహిస్తున్న జిల్లా గవర్నర్ సరళదేవి, రమేష్ దంపతులను అభినందించారు.

అదెవిదంగా వేడుకలు నిర్వహించిన తారకపురి క్లబ్ ప్రెసిడెంట్ పవన్ కుమార్, సెక్రటరీ రామకుమార్, తణుకు ప్రెసిడెంట్ కోడూరు సత్యనారాయణ, కోరిపల్లి సత్యనారాయణ, చీకటి సత్యనారాయణ, కడియాలు సూర్యనారాయణ, చోడే గోపి, బెజవాడ సూరిబాబు తదితరులకు అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పూర్వపు గవర్నర్ దామర రంగారావు, మాదిరెడ్డి బాబుజీ రావు, గట్టిమ్  మాణిక్యాలరావు, ఎం మురళీమోహన్, సిహెచ్ సత్యనారాయణ, వేమ కోటేశ్వరరావు,డాక్టర్ రామ్ బ్రహ్మం, పుట్ట విజయ, వంక రాజకుమారి, కే.ఎన్ .పద్మావతి, చిట్టూరి సుజాత, రజిని, కే శ్యామల, బి. శ్రీ సత్య అన్నపూర్ణాదేవి, ఎ.అన్నపూర్ణ తదితర జిల్లా నాయకులు కళాశాల విధ్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link