48వ వార్డు సమస్యలపై గంకల కవిత అప్పారావు యాదవ్ పోరుబాట
సమస్య ఏదైనా తక్షణమే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళుతున్న గంకల
48వ వార్డు ఇందిరానగర్ – 1,జై భారత్ నగర్, శ్రీనివాస్ నగర్, బాపూజీ నగర్ లలో ప్రజా సమస్యలపై, అభివృద్ధి పనులపై గంకల సుడిగాలి పర్యటన
జీవీఎంసీ 48వ వార్డు కొండవాలు ప్రాంతంలో గురువారం నాడు జీవీఎంసీ 48వ వార్డు కార్పొరేటర్,జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్,జీవీఎంసీ బీజేపీ ఫ్లోర్ లీడర్ గంకల కవిత అప్పారావు యాదవ్ విస్తృత పర్యటన చేశారు.వార్డులో మార్నింగ్ టూ నైట్ గుడ్ మార్నింగ్ గంకల పేరిట పర్యటన చేసి ప్రజలతో కలిసి ఇందిరానగర్ – 1,జై భారత్ నగర్, శ్రీనివాస్ నగర్, బాపూజీ నగర్ లలో ప్రజా సమస్యలను తెలుసుకొని,అభివృద్ధి పనులను స్థానికలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డులో ప్రజల నుంచి సమస్యలపై వినతి పత్రాలను తీసుకొని తక్షణమే అధికారులను ఫోన్ లో సంప్రదించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఇందులో భాగంగా బాపూజీ నగర్ లో నిర్మాణం జరుగుతున్న సామాజిక భవన పనులను నేరుగా పరిశీలించి నాణ్యత విషయంలో రాజీ లేకుండా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను కాంట్రాక్టర్లను సూచించారు. వార్డు పర్యటనలో భాగంగా పలుచోట్ల రోడ్డు,కాలువలు మరమ్మతులు గురయ్యాయని గుర్తించి త్వరలో నూతన రోడ్డు నిర్మాణం,కాలువలు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. గుడ్ మార్నింగ్ గంకల పేరుతో ఉదయం నుంచి రాత్రి వరకు పర్యటన చేసి రాత్రిపూట కొండవాలు ప్రాంతంలో చీకటి ప్రదేశం నెలకొనడం గమనించి ఆ చోట నూతన వీధి దీపాలను ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి వినతిపత్రం స్వీకరించి తక్షణమే అధికారులతో సంప్రదించి త్వరలో నూతన వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని గంకల హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గంకల కవిత అప్పారావు యాదవ్ మాట్లాడుతూ 48వ వార్డులో ప్రజా సమస్యలపై విస్తృతంగా పర్యటనలు చేస్తూ ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని,సమస్య ఏదైనా ఉంటే తక్షణమే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు. వార్డులో నిర్మాణ దశలో ఉన్న బాపూజీ నగర్ కమ్యూనిటీ హాల్ పనులను పరిశీలించి పలు సూచనలు చేయడం జరిగిందని పలుచోట్ల రోడ్లు,కాలువలు,వీధి దీపాలు ఆవశ్యకత ఉందని ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించడం జరిగిందని త్వరలో ప్రజల సమస్యలను పరిష్కారం చూపుతామని అన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు వార్డులో పర్యటన చేస్తూ ప్రజా సమస్యలపై పోరుబాట చేపట్టిన గంకల కవితా అప్పారావు యాదవ్ తీరుపట్ల వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వార్డు ప్రజలకు ఎటువంటి సమస్య ఏర్పడిన తక్షణమే తనను సంప్రదించాలని గంకల సూచించారు.


