కాపు రాజ్యాధికార పోరాట సమితి ఆత్మీయ సమ్మెళనంలో బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాపులు ప్రాధాన్యం గల అన్ని రంగాలలోనూ ముఖ్యపాత్ర పోషిస్తున్నారని భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ అన్నారు. కాపు రిజర్వేషన్ పోరాట సమితి, కాపు రాజ్యాధికార పోరాట సమితి సంయుక్త నిర్వహణలో ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని బీసీ కులాలపై రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న వివక్ష, అణచివేత గురించి ప్రస్తావించారు. అదేవిధంగా రాష్ట్రంలో సంఖ్యాపరంగా గణనీయంగా ఉన్న కాపులపైన కూడా రాజకీయ పార్టీలు వివక్ష చూపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Scroll to Top
Share via
Copy link