అధికారుల పట్ల జగన్ అనుచిత వ్యాఖ్యలు సరికాదు
జగన్ వ్యాఖ్యలను కారుమూరి ఖండించకపోవడం దారుణం
తక్షణమే వ్యాఖ్యలను జగన్ ఉపసంహరించుకోవాలి
అఖిల భారత యాదవ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ
బీసీలపై తనకు ఎంతో ప్రేమ ఉందని ఎన్నికల సమయంలో చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు బీసీల పట్ల చులకన భావంతో చూస్తున్నారని అఖిలభారత యాదవ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియాల సూర్యనారాయణ విమర్శించారు. ఇటీవల యాదవ వర్గానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. శనివారం తణుకులోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో బీసీలకు ఎంతో మేలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి బీసీలను బానిసలుగా చూశారని పేర్కొన్నారు. బీసీల పట్ల జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను స్థానిక ప్రజా ప్రతినిధి, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కనీసం ఖండించకపోవడం దారుణమన్నారు. బీసీల ఓట్లతోనే గెలిచి మంత్రి పదవి చేపట్టిన కారుమూరి కనీసం స్పందించకపోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకొని అధికారం రాగానే తొక్కేయడం మాజీ మంత్రి కారుమూరితో పాటు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి పరిపాటిగా మారిందన్నారు. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి బీసీలు కొనపడనని చెప్పి కేవలం 11 స్థానాలకే పరిమితం చేశారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఇదే వరదని కొనసాగిస్తే సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీలకు రూ. 36 వేల కోట్లతో నిధి కేటాయించి వారి సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను కేవలం తణుకు పట్టణానికి చెందిన యాదవ్ సంఘం నాయకులే కాకుండా జాతీయస్థాయిలో సైతం తీవ్ర వ్యతిరేకత వస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం చేస్తే భవిష్యత్తులో రోడ్డుపై నిలబెట్టి నిలదీస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్ని వర్గాలను కలుపుకుంటూ ప్రజా సంక్షేమాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోకపోతే మరిన్ని ఆందోళనలు చేపడతామని ఈ సందర్భంగా సూర్యనారాయణ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యాదవ సంఘం సభ్యులు సప్పా వీరరాఘవులు, కొయ్యల సత్యనారాయణ, పీతల శివ, జమ్మి ప్రకాశరావు, పీతల వెంకటేశ్వరరావు, కిలాని శ్రీను, పిట్ట శివకుమార్, యాకల అప్పారావు, నంద శ్రీనివాసరాువు, నొడగల పరమేష్ పాల్గొన్నారు.


