ప్రజాసమస్యల సత్వర పరిష్కారానికై ఇరగవరంలో ఆరిమిల్లి ప్రజాదర్బార్

ఇరగవరం మండలంలో ప్రజాసమస్యల సత్వర పరిష్కారానికై ఇరగవరం మండల ప్రజాపరిషత్ కార్యాలయము నందు శనివారం తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రజాదర్బార్ కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమములో శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రజల నుంచి స్వయంగా ఆయన 97 అర్జీలు, వినతిపత్రాలను స్వీకరించారు. వచ్చిన అర్జీలలో త్రాగునీరు, డ్రైన్స్, రోడ్స్, హౌసింగ్ మరియు శానిటేషన్ మొదలగు అర్జీలు వచ్చాయి. సదరు అర్జీలు పరిశీలించి సంబంధిత శాఖఅధికారులతో మాట్లాడి వెంటనే వారి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాసమస్యలకు అత్యధిక ప్రాధాన్యత దక్కుతోందని తెలిపారు. కార్యక్రమములో ఇరగవరం మండలములోని వివిధ గ్రామాల ప్రజలు, కూటమి నాయకులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ.శ్రీనివాసు, తహసీల్దార్ ఎం.సుందర్ రాజు, వివిధ శాఖల మండల స్దాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link