ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన “ప్రజా దర్బార్” లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్

ప్రజల నుంచి స్వయంగా అర్జీల స్వీకరణ.. త్వరితగతిన అమలుకు చర్యలు తీసుకుంటామని హామీ

నిడదవోలు: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం నిడదవోలు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక “ప్రజా దర్బార్” (PGRS)లో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.. ప్రధానంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోటా లో పెన్షన్లు అందించాలని సంబంధిత బాధితులు మంత్రి దుర్గేష్ ను కోరారు. 22ఏ నిషేధిత జాబితా భూముల విషయమై ఆన్ లైన్ లో తలెత్తుతున్న సమస్యలను ప్రస్తావించగా వెంటనే కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సహకార సొసైటీల సమస్యతో పాటు ఇళ్ల పట్టాలకు సంబంధించిన సమస్యలు మంత్రి దృష్టికి రాగా వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. కొన్ని సమస్యలను అధికారులతో నేరుగా మాట్లాడి తక్షణమే పరిష్కరించారు. మంత్రి కందుల దుర్గేష్ స్పందన పై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం మండల తహశిల్దార్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link