తుపాను బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి

నిత్యావసరాలు అందజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ

ఇటీవల మొంథా తుపాను కారణంగా ఇబ్బందులు పడిన బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం తణుకు పట్టణంలోని ఇరగవరం కాలనీకు చెందిన 30 మల్లికాసుల కుటుంబాలకు పది కిలోల బియ్యంతోపాటు నిత్యావసరాలను ఎమ్మెల్యే రాధాకృష్ణ పంపిణీ చేసి మాట్లాడారు. మొంథా తుపాను ప్రభావం ఉంటుందుని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నాటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ప్రజలతోపాటు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చర్యలు తీసుకున్నారని చెప్పారు. అయితే ఇటీవల తణుకు పట్టణంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి రాలేని సుమారు 30 కుటుంబాలకు నిత్యావసరాలను అందజేయడం జరిగిందన్నారు. ఇప్పటికే పునరావాస కేంద్రంలో తలదాచుకున్నవారికి ప్రభుత్వం రూ. 3 వేలు చొప్పున ప్రకటించిందని గుర్తు చేశారు. తణుకు నియోజకవర్గంలో సైతం నిరంతరం అందుబాటులో ఉంటూ అధికార యంత్రాంగం, కూటమి నాయకులు ఎప్పటికప్పుడు ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నారని అభినందించారు. ఈ సందర్భంగా అధికారులు, కూటమి శ్రేణులను ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link