- డా పి ప్రియాంక
గత కొన్ని రోజులుగా ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహించిన సమ్మె ప్రభుత్వం తో చర్చలు సఫలమవడంతో, శనివారం నుండి డా. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద అన్ని వైద్య సేవలు ప్రైవేట్ ఆసుపత్రుల యందు యథావిధిగా కొనసాగుతున్నాయని ఎన్టీఆర్ వైద్య సేవా జిల్లా సమన్వయాధికారి పి. ప్రియాంక శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఉచిత వైద్య సేవలను యథావిధిగా పొందగలరనీ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 45 ప్రైవేట్ ఆసుపత్రులు డా. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఉచిత వైద్య సేవలను అందిస్తున్నాయనీ వెల్లడించారు.
ప్రజలు ఎటువంటి అపోహలకు లోనుకాకుండా, తమకు సమీపంలోని గుర్తింపు పొందిన ఆసుపత్రులను సంప్రదించి ఉచిత చికిత్స పొందగలరు. మరిన్ని వివరాలకు సంబంధిత ఆసుపత్రులలోని వైద్యమిత్ర సిబ్బందిని సంప్రదించగలరనీ తెలియ చేశారు.


