రాష్ట్రస్థాయి గుర్తింపు – జిల్లా గర్వకారణం
మొంథా తుఫాన్ ఫైటర్లకు అభినందనలు — మంత్రి కందుల దుర్గేష్,
జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావుకు ప్రశంస పత్రాలు
అమరావతిలో శనివారం జరిగిన మొంథా తుఫాన్ ఫైటర్ల అభినందన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 137 మంది అధికారులకు మెమెంటోలు, ధృవపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జిల్లా మంత్రి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్నారు.
మంత్రి కందుల దుర్గేష్‌కి ప్రత్యేక గౌరవం
మొంథా తుఫాన్ సమయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని సమన్వయంతో ముందుండి నడిపి ప్రజల రక్షణకు నిరంతరం కృషి చేసినందుకు మంత్రి కందుల దుర్గేష్‌కి సీఎం చంద్రబాబు ప్రశంస పత్రం అందజేశారు. ఈ గుర్తింపు జిల్లా యంత్రాంగానికి, ప్రజా ప్రతినిధుల సమష్టి కృషికి స్పూర్తినిచ్చిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. “మంత్రిగారి నాయకత్వం, నిబద్ధత ప్రభుత్వ సేవలకు ఆదర్శంగా నిలిచాయి” అని కలెక్టర్ తెలిపారు.
జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు ప్రశంసనీయ సేవలు
తుఫాన్ సమయంలో వ్యవసాయ రంగంలో నష్టాన్ని తగ్గించడంలో, రైతులకు తక్షణ సహాయం అందించడంలో కీలకపాత్ర పోషించినందుకు జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు ప్రశంస పత్రం అందుకున్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సమన్వయంగా పనిచేసిన జిల్లా యంత్రాంగం తీరును సీఎం అభినందించారని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవ రావు తెలిపారు.
⦁ మొంథా తుపానులో ఉత్తమ సేవలు అందించిన వారికి శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో అభినందన కార్యక్రమం
⦁ సైక్లోన్ మొంథా ఫైటర్లుగా గౌరవిస్తూ సర్టిఫికెట్లు , మెమోంటోలను అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
⦁ తుపాను విపత్తులో ఉత్తమ సేవలు అందించిన 175 మందిని గుర్తించి వారికి సీఎం ప్రత్యేక అభినందనలు


