బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తేతలిలో భారతరత్న డా.ఎ.పి.జె.అబ్దుల్ కలాం 94వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
ప్రధానోపాధ్యాయులు కోట సూర్య వెంకట విశ్వేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ కలాం చిత్రపటాన్ని పూలమాలతో అలంకరించి, ఉపాద్యాయులు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్ధులకు అబ్దుల్ కలాం జీవిత చరిత్ర గురుంచి తమిళనాడులోని రామేశ్వరంలో పేద కుటుంబంలో జన్మించిన అబ్దుల్ కలాం స్వయంకృషితో రాష్ట్రపతి స్థాయికి చేరుకున్నారని, క్షిపణి పితామహునిగా, భారతరత్నగా గుర్తించబడ్డారని, నీతినిజాయితీలకు, దేశభక్తికి మరో రూపం అని, విద్యార్థులందరూ అబ్దుల్ కలామ్ ని ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని హితవు పలికారు. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు బి.ఎం.గోపాల రెడ్డి “కలలు కనండి- వాటిని సాకారం చేసుకోండి”
“సంతకం ఆటోగ్రాఫ్ గా మారడమే విజయం అంటే” మొదలైన అబ్దుల్ కలాం సూక్తులను విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో సిబ్బంది కార్యదర్శి జె.రాజకుమారి, జి.సుధారాణి, పి.గంగాభవాని, మారుతీరామ్, రామకృష్ణ, వెంకటేశ్వరరావు, మాధవి లక్ష్మి, స్వతంత్ర భారతి, పుష్పవల్లి, పావని, సూర్యచంద్రకుమారి, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.


