వెల్లడించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
రూ. 25 లక్షలతో ఎస్సీ బాలికల వసతి గృహం అభివృద్ధి పనులకు శంకుస్థాపన
వసతి గృహాల్లో విద్యార్థుల సదుపాయాలు మెరుగుపరిచి, కనీస సౌకర్యాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు 13వ వార్డులో ఎస్సీ సంక్షేమ వసతి గృహం అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆదివారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఎందుకు సంబంధించి తణుకు ఆంధ్ర షుగర్స్ యాజమాన్యం సిఎస్ఆర్ నిధులు రూ. 25 లక్షలు మంజూరు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ నిధులతో మరమ్మతులు, డైనింగ్ హాలు నిర్మాణం ప్రారంభించుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వర్షాలు కురిసిననప్పుడు కింద నుంచి నీరు రావడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. దీంతోపాటు డైనింగ్ హాల్ గుర్తిస్తాయిలో శిథిలావస్థకు చేరిన దశలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చొరవతో నిర్మాణ పనులు ప్రారంభించుకోవడం జరిగిందని చెప్పారు. జిల్లా అభివృద్ధిలో కలెక్టర్ నాగరాణి తనవంతు సహకారం అందిస్తున్నారని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


