తేతలి ఉన్నత పాఠశాలలో మట్టి వినాయక విగ్రహాల పోటీ:

వినాయక చవితిని పురస్కరించుకొని మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై అవగాహన నిమిత్తం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోట సూర్య వెంకట విశ్వేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో జీవశాస్త్ర ఉపాధ్యాయులు పి. గంగా భవాని, బి. ఎం. గోపాల రెడ్డి ల సారధ్యంలో విద్యార్థులకు మట్టి వినాయక విగ్రహాల పోటీ ఏర్పాటు చేశారు. ఈ పోటీలో విజేతలకు మట్టి వినాయక ప్రతిమలను బహుమతులుగా అందిస్తూ ప్రధానోపాధ్యాయులు మట్టి వినాయక విగ్రహాలనే ఎందుకు వాడాలో, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల జల వనరులు ఎలా కలుషితమవుతున్నాయో వివరించారు.

జీవ శాస్త్ర ఉపాధ్యాయుడు బియ్యం గోపాలరెడ్డి
” ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు – పెరట్లో మట్టే ముద్దు”
” ఆయిల్ పెయింట్స్ వద్దు – పసుపు కుంకుమ చాలు “
” మట్టి గణపతిని పూజిద్దాం – పర్యావరణాన్ని పరిరక్షిద్దాం “
మొదలగు నినాదాలు చేయించారు.
ఈ కార్యక్రమంలో కె. పుల్లారెడ్డి, జె. రాజకుమారి, జి. సుధారాణి, డివిఎస్ మారుతిరామ్, ఎస్.రామకృష్ణ, పి.డి. వెంకటేశ్వరరావు, జె. బుచ్చియ్య, ఎం. ఎన్. పుష్పవల్లి, పి. పావని, వి. బాల సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link