స్వతంత్రం రావడానికి ముందే గోదావరి జిల్లాలో పారిశ్రామిక అబివృద్ధికి బీజం వేసిన అభినవ ఆంధ్రా బిర్లా ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ 105వ జయంతిని తణుకులో బి.జే.పినాయకురాలు తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ డా.ముళ్ళపూడిరేణుక ఆధ్వర్యంలో సొమవారం ఘనంగా నిర్వహించారు. విగ్రహాల వద్ద ఏర్పాటుచేసిన సభలో డా. ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ (హరిబాబు)తో ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్ని తనదైనశైలిలో ముందు చూపుతో ముందుకు నడిపించిన దిగ్గజం, తణుకు పట్టణాన్ని ప్రపంచ పటంలో నిలిపిన మహానుభావుడు, కళాప్రపూర్ణ, అందరూ ముద్దుగా పిలుచుకునే ఆంధ్ర బిర్లా ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ అని అన్నారు. అదేవిధంగా ఆయన సమయపాలన, క్రమశిక్షణ, నిరాడంబరత నేటి యువత ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు.


