తణుకు బాలుర ఉన్నత పాఠశాలలో ధరిత్రి దినోత్సవం

తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు ధరిత్రి దినోత్సవం. వరల్డ్ ఎర్త్ డే ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తణుకు ఎంఈఓ 2 జీ.బీ.వి ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి K . పద్మావతి, విద్యార్థులు, జీవ శాస్త్ర ఉపాధ్యాయులు అందరూ కలిసి ర్యాలీని నిర్వహించడం, ఇంకుడు గుంటలను, కంపోస్ట్ గుంతలు తవ్వి వాటి ద్వారా నీటిని పొదుపు చేయడం, మొక్కలను నాటడం, మొక్కల ప్రాముఖ్యత గురించి వివరించడం కార్యక్రమాలు నిర్వహించడమైంది. విద్యార్థులు,జీవశాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొని దరిత్రీ దినోత్సవం, భూమిని కాపాడు కోవడం దాని ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది. చెట్లను నాటడం,నీటిని సంరక్షించుకోవడం, నేలను సారవంతంగా ఉంచుకోవడం అనే అంశాల గురించి వివరించడం జరిగింది. కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కే పద్మావతి అధ్యక్షత వహించగా తణుకు ఎంఈఓ 2 జీ.బీ.వి ప్రసాదు, మండల వనరుల కేంద్రం సిబ్బంది జీవశాస్త్ర ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link