
పదవులకు వన్నె తెచ్చిన బాబూ జగజ్జీవన్ రామ్
మాజీ ప్రధాని జగ్జీవన్ రామ్ ఆశయాలు అనుసరణీయం
సమానత్వం కోసం పాటుపడిన మహనీయుడు జగ్జీవన్ రామ్
జగ్జీవన్ రామ్ సేవలను కొనియాడిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
తణుకు నియోజకవర్గంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
******దేశ ఉపప్రధానిగా, కేంద్రమంత్రిగా బాబూ జగజ్జీవన్ రామ్ చేపట్టిన పదవులకు వన్నె తెచ్చిన మహనీయుడని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. సమానత్వం కోసం పాటుపడిన బాబూ జగ్జీవన్ రామ్ ఆశయాలను ప్రతిఒక్కరు అనుసరించాలని కోరారు. బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను పురస్కరించుకొని శనివారం తణుకులోని ఎన్టీఆర్ పార్కు వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ దళిత కుటుంబంలో జన్మించిన బాబు జగజ్జీవన్ రామ్ కుల వివక్షకు గురై సమానత్వం కోసం తనజీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. ఉన్నత చదువులు చదివి స్వాతంత్ర్య భారతదేశంలో కోసం పోరాడిన మహనీయులు బాబు జగజీవన్ రామ్ ఒకరిని అన్నారు. కేంద్ర మంత్రిగా ఉప ప్రధానిగా, ఆయన నిర్వహించిన పదవులకు గుర్తింపు తీసుకువచ్చి ఆయారంగాల్లో భారతదేశం పురోగతి సాధించడానికి తనవంతు కృషి చేశారని పేర్కొన్నారు. దేశంలో అణగారిన వర్గాలకోసం, సమానత్వంకోసం ఆయన చేసిన పోరాటం ఈరోజుకీ ఎంతోమందిలో స్ఫూర్తిని నింపుతోందని చెప్పారు. కులమతాలకు అతీతంగా సమాజం స్థాపింపబడాలనే ఆయన ఆశయాలకు అనుగుణంగా సమానత్వం సాధించే విధంగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. బాబూ జగ్జీవన్ రామ్ స్ఫూర్తిని తీసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దళితులకోసం ఎన్నో పథకాలతో పాటు సబ్ ప్లాన్ నిధులు ఇలా బడ్జెట్ లో కేటాయింపులు చేశారని గుర్తు చేశారు. పేదరికాన్ని గెలిచే విధంగా ప్రతి ఒక్కరు ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు పి4 విధానంలో బాబు జగ్జీవన్ రామ్ కలలుగన్న ఆశయాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందని చెప్పారు. అమరావతి రాజధానిలో బాబూజగ్జీవన్ రామ్ విగ్రహాన్ని నెలకొల్పే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అంతకుముందు ఇరగవరం మండలం కావలిపురం గ్రామంలో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అత్తిలి, రేలంగి, కంతేరు, తేతలి గ్రామాల్లో జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో నిర్వహించిన వాలీబాల్ పోటీలు ముగింపు సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

