తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ
తణుకు పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో
ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పార్ట్ టైం ఎంప్లాయ్ లాగా అప్పుడప్పుడు తణుకు వచ్చి ప్రెస్ మీట్ లు పెట్టి బురదజల్లి వెళ్లిపోవడం అలవాటుగా మారిందని అన్నారు. ఏదో ఒకటి మాట్లాడి చంద్రబాబు నాయుడుని విమర్శించడం ఇక్కడ మమ్మల్ని విమర్శించడం ఇదే పనిగా ఉంటూ నియోజకవర్గంలో ఏదైనా ఫంక్షన్ ఉంటే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్ గాని, వైజాగ్ గాని వెళ్లిపోవడం అలవాటైపోయిందని అన్నారు. ఇలాంటి వ్యక్తిని ఈ నియోజకవర్గ ప్రజలు ఓటుతో కొట్టారని అన్నారు, అయినా అయినా సరే రియలైజేషన్ లేకుండా అదే మోసపూరిత భాషలో ఏ విధంగా అయితే మాట్లాడాడో ఇప్పుడు కూడా కనీసం ఈ నియోజకవర్గ ప్రజలు ఎంత హీన మైనటువంటి మెజార్టీ నీకు ఇచ్చారని అయినప్పటికీ కూడా నీలో మార్పు రాలేదని అన్నారు. ఇప్పటివరకు నీ నోటి దూల కంట్రోల్ లో లేనటువంటి విధంగా ఉందని నియోజకవర్గ ప్రజలు నీకు ఇచ్చిన ఓట్లు రివ్యూ చూసుకోమని అసలు లెక్క పెట్టుకున్నావా అని, తణుకు టౌన్ లో ఎలక్షన్ బూతులు కొన్నింటిలో నీకు డిపాజిట్లు కూడా రాలేదని 100 కి 14% ఓట్లు వేశారని రాష్ట్రంలో మీ పార్టీకి, 40% పర్సెంట్ వచ్చాయని నీకు కేవలం 29% ఓట్లు ప్రజలు వేశారని అన్నారు. తణుకు నియోజకవర్గంలో ప్రజలు వేసిన ఓట్లు నీ 5 సంవత్సరాలు పరిపాలన ఫలితం అని అన్నారు. రాష్ట్రంలో నీవు క్రింద నుంచి ఆరవస్థానంలో ఉన్నావని నీ తరఫున ఓట్లు సంపాదించిన వారిలో నీవు క్రింద నుంచి ఆరవ స్థానంలో ఉన్నావని అన్నారు. ఏ మొఖం పెట్టుకొని మాట్లాడుతున్నావ్ అసలు నీకు సిగ్గుందా అంతా ఘోరమైన ఓటమి చెంది ఈరోజు మా ప్రభుత్వాన్ని విమర్శిస్తావా చంద్రబాబు నాయుడుని విమర్శిస్తావా అని అన్నారు. ఈరోజు మీనాయకుడు జగన్ మోహన్ రెడ్డి చేసిన నిర్వాహకం వలన రాష్ట్రం అధోగతి పాలైతే దాన్ని గాడిలో పెట్టే విధంగా దాదాపు 9 నెలలుగా నిద్రాహారాలు మాని చంద్రబాబు నాయుడు కేంద్రప్రభుత్వం సహకారంతో సమన్వయంతో నిధులు తీసుకుని వచ్చి అదేవిధంగా పెట్టుబడులు, పారిశ్రామికవేత్తలను అనేకమంది చంద్రబాబు నాయుడునీ, చూసి ఈ ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని అన్నారు. మీ జగన్మోహన్ రెడ్డి 12 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లిపోయారని ఎక్కడైనా అభివృద్ధి అనేది చేశారా అలాగే సంక్షేమ అభివృద్ధి ఏమైనా చేశారా అనేక సంక్షేమ పథకాలకు కోతలు పెట్టారని మీ యొక్క ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆరోజు అధికారాన్ని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుని కింద నుంచి పైస్థాయి వరకు ఈ రాష్ట్రాన్ని అధోగతి పట్టించినారని అన్నారు. అలాంటి పరిపాలన నుంచి ఈరోజు చంద్రబాబునాయుడు బ్రాండ్ గా ఆంధ్రప్రదేశ్ ని అన్ని విధాలుగా ముందుకు నడిపిస్తున్నారని, స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని సాధించాలని ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు ఆర్థిక ఆదాయాలను పెంచే విధంగా ఆర్థిక అభివృద్ధి సాధించే విధంగా ఇటు అభివృద్ధి అటు సంక్షేమంతో పాటుగా ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని అన్నారు.ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని అన్నారు, ఈరోజు మీరు వచ్చే ప్రెస్ మీట్ లు పెడితే అదేదో సంతోషంగా లేదని కాదు మీరు ఫీల్డ్ లో తిరగండి ప్రజల యొక్క పరిస్థితులు తెలుసుకోండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నివర్గాల ప్రజలు కూడా కూటమి ప్రభుత్వ పరిపాలన పట్ల సంతృప్తితో ఉన్నటువంటి వాస్తవాన్ని మీరు గ్రహించాలని అన్నారు. ఇవన్నీ చూడకుండా ఆలోచించకుండా చంద్రబాబునాయుడు ఏదో అప్పులు చేశారని మీరు అంటున్నారని చంద్రబాబునాయుడు చేసే అప్పులు ఆదాయం పుట్టిస్తున్నారని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ని పెంచుతున్నారని అన్నారు. మీ ప్రభుత్వంలో ఎప్పుడైనా బడ్జెట్లో ఈరాష్ట్రం ఆదాయం పెరిగే విధంగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కు నిధులను ఎప్పుడైనా కేటాయించారా అలాంటిదేమీ లేదని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 35% బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు. మీ ప్రభుత్వంలో అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలన చేసిన మీరు చేస్తే అటువంటి పాలన నుంచి బయట పడేసే విధంగా చంద్రబాబునాయుడు చేస్తున్నారని రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా చంద్రబాబునాయుడు ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు. ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో అదే ధరలకు మంచిమధ్యాన్ని ఈ ప్రభుత్వం అంద చేస్తుందన్నారు. కానీ దాన్ని పక్కదోవ పట్టించే విధంగా మీరు మాట్లాడుతున్నారని అన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తారు అదేవిధంగా రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. వైసిపి ప్రభుత్వంలో మీరు నొక్కిన బటన్ లకు ప్రజలు మీకు ఎలా నొక్కాలో చూశారన్నారు. మీరు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని నియోజకవర్గంలో నీకు రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీకి ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో అనడానికి ఈరోజు వచ్చిన ఫలితాలు కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలని అన్నారు. మీ ప్రభుత్వంలో అనేక రకాలుగా ల్యాండ్ దోపిడీ చేసే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చారని అది వాస్తవమని ప్రజలు అనేకమంది ఫిర్యాదులు ప్రభుత్వానికి తెలియజేయడమైనదని అన్నారు, అలాంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఈరోజు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకువచ్చి, నీలాంటి ముఠా కోరులను దగాకోరులను అరికట్టడానికి కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. చంద్రబాబునాయుడు 20047 విజన్ తో 2029వ దాటికి రాష్ట్రాన్ని ప్రతి సంవత్సరం 15 శాతం పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు, మీరు చేసేటువంటి పనులు మీ నాయకుడు మీరు రాష్ట్రంలో విసిటింగ్ కు వచ్చినట్లు వచ్చి అప్పుడప్పుడు ప్రెస్ మీట్ లు పెట్టి వెళ్లిపోతున్నారని జగన్మోహన్ రెడ్డి అక్కడ మీరు ఎక్కడని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.


