పల్నాడు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఇంఛార్జి ప్రాజెక్ట్ డైరెక్టర్ గా కె.హీరాలాల్ బాద్యతలు

పల్నాడు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఇంఛార్జి ప్రాజెక్ట్ డైరెక్టర్ గా కె . హీరాలాల్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు . ఈయన ప్రస్తుతం జిల్లా నీటి యాజమాన్య సంస్థ లో ఫైనాన్స్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఇంఛార్జి పథక సంచాలకులు గా బదిలీ అయ్యారు . ఇక్కడ ఇలా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారిగా ఉన్న బాలు నాయక్ పై అవినీతి ఆరోపణలు రావటంతో జిల్లా కలెక్టర్ ఆయన విధుల నుండి సరెండర్ చేశారు.

Scroll to Top
Share via
Copy link