76 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 4వ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి డి. సత్యవతి మరియు ఇతర న్యాయమూర్తులు జెండా వందనం చేసారు. తరవాత వివిధ స్కూల్స్ యందు మండల న్యాయసేవల సంస్థ వారు నిర్వహించిన మాదక ద్రవ్యాలు దుర్వినియోగం, బాల్య వివాహాలు నిరోధక చట్టం, బాలకార్మిక నిర్మూలన చట్టం, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంశాలపై వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థిని/విద్యార్దులకు సర్టిఫికెట్లు, మెమోంటోలు, న్యాయమూర్తులు అందచేసారు. పిల్లలకు చదువుకునేటప్పటి నుండి చట్టాలపై, వివిధ చట్టాలపై అవగాహన కలిగి వుండాలని, దానిద్వారా మంచి చెడు అవగాహనతో వుంటారని తెలిపారు, మండల న్యాయసేవల కమిటీ తణుకు వారు ప్రతిరోజూ కోర్టులో ఉచిత న్యాయసలహా సహాయం అందిస్తున్నారని అవసరం వున్నవారు ఉపయోగించుకోవాలని కోరారు. ఇందులో న్యాయమూర్తులు 4వ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి సత్యవతి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి కె. కృష్ణ సత్యలత, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి పోతర్లంక సాయిరామ్ మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి.ఎన్.వి. రంజిత్ కుమార్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూరంపూడి కామేష్, న్యాయవాదులు, జిల్లాపరిషత్ హైస్కూల్ (గర్ల్) తణుకు, సుంకవల్లి హైస్కూల్, ఉండ్రాజవరం టీచర్లు, పిల్లలు పాల్గొన్నారు.


