మోడీ ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయకపోతే స్వాతంత్రయోధ్యమ స్పూర్తితో పోరాటం సాగిస్తామని CITU జిల్లా కార్యదర్శి పీవీ. ప్రతాప్ హెచ్చరించారు. ఆదివారం బ్యాంకు కాలనీలో CITU ఆధ్వర్యంలో నిరసన ధర్నా జరిగింది. రద్దు చేయాలి లేబర్ కోడ్స్, రద్దు చేయాలి రైతు వ్యతిరేక చట్టాలు, కనీస వేతనం 26వేలు ఇవ్వాలని, ప్రభుత్వ సంస్థలు ప్రయివేట్ ఆపాలని పెద్దత్తున నినాదాలు చేశారు. ఈ సందర్బంగా ప్రతాప్ మాట్లాడుతూ… 76 వ ఘనతంత్ర దినోత్సవం జరుపుకొంటున్నప్పటికి దేశ ప్రజల సమస్యలు నేటికీ పరిష్కారం కాలేదని విమర్శించారు. స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొని వాళ్ళు దేశాన్ని పాలించడం సిగ్గుచేటన్నారు. మోడీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన నాటినుండి నేటి వరకు కార్పొరేట్ల కోసం పని చేశారన్నారు. ఓట్లు వేసిన దేశ ప్రజల పైన బారాలు, పెట్టుబడి దారులకు పన్నులు తగ్గించడం చేస్తున్నారని అన్నారు. 3వ సారి ఎన్నికలలో మోడీకి బ్రేక్ వేసింది ప్రజలేనని చరిత్రని మార్చేది కూడా ప్రజలే అన్నారు. తోలుత జాతీయ జెండా ని ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమం లో CITU నాయకులు అడ్డగర్ల అజయ కుమారి, కామన మునిస్వామి, గార రంగారావు, యం. రమేష్, i, ch. రామకృష్ణ, హర్ష, నరేష్, శర్మ, మోహన్ రావు, శివకుమార్, మహేష్, నారాయణ, గణేష్, విజయ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


