రామానుజన్ మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ లో భాష్యం విద్యార్థుల ప్రతిభ : రామానుజన్ ఎడ్యుకేషనల్ సోసైటీ ఆధ్వర్యంలో రామచంద్రపురం లో నిర్వహించిన రామానుజన్ మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ లో తణుకు భాష్యం స్కూల్ లో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థి పి కిషన్ చంద్ జిల్లా ద్వితీయ స్థానాన్ని ఏడవ తరగతి చదువుతున్న ఎల్. సిరి భార్గవి, 8వ తరగతి చదువుతున్న బి. చందన ప్రియ, 9వ తరగతి చదువుతున్న బి. అభిరామ్ లు ప్రశంసా పత్రాలు మరియు జ్ఞాపికలు గెలుపొందారని భాష్యం స్కూల్స్ ప్రిన్సిపాల్ ఏ. శ్రీమన్నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ జి.వి. పాండురంగారావు, ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు.


