తణుకు పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం నందు తణుకు శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ, గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ముందుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కి మహాత్మాగాంధీ నివాళులర్పించారు. అనంతరం జాతీయజెండాను ఎగురవేసి జాతీయ వందనం సమర్పించినారు. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి స్వాతంత్ర సమరయోధులను వారందరినీ స్మరించుకుంటూ రాజ్యాంగాన్ని యొక్క స్ఫూర్తిని ఒక్కరు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఒక అత్యున్నతమైన రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయులు అందరికీ కూడా నివాళులు అర్పిస్తూ మన భారతదేశం 2047 కి అన్నివిధాలుగా అన్నిరంగాలలో కూడా ముందు ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అలాగే మనరాష్ట్రం 2047 విజన్ తో చంద్రబాబునాయుడు కూడా ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకుంటూ ప్రజాస్వామ్యం స్ఫూర్తిని అభివృద్ధి, సంక్షేమం సుపరిపాలన అందించడం అనేదే కూటమి ప్రభుత్వం యొక్క ధ్యేయం అని ఆ దిశగా చంద్రబాబునాయుడు నాయకత్వంలో మోడీ సహకారంతో ఈ రాష్ట్రం అన్నివిధాలుగా కూడా అభివృద్ధి పదములో పరుగులు పెట్టేవిధంగా ముందుకు వెళ్లడం జరుగుతుందని అన్నారు. ఈ ఏడు నెలల పరిపాలనలో ఎన్నో విజయాలు సాధించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఏదైతే ఉందో అది నిర్వీర్యం అయ్యే పరిస్థితుల్లో మరల ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ను పున:నిర్మించడం జరిగిందన్నారు. అనేకమంది పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రావడం జరుగుతుందని ఈ విధంగా మనమందరం కూడా ఏదైతే మనకి అందించినటువంటి భారతదేశ యొక్క స్వతంత్రం యొక్క గణతంత్ర దినోత్సవం యొక్క పరిరక్షణ కోసం మనమందరం కూడా పాటుపడాలని ఈ సందర్భంగా అన్నారు. అనంతరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా తణుకు పట్టణ మున్సిపల్ ఆఫీసు ఎదురుగా ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తణుకు మున్సిపల్ ఆఫీసు నందు ఉన్న జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ వందనం చేసినారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.


