గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం తణుకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బొల్లాడనాగరాజు ఆధ్వర్యంలో సజ్జాపురం 28 వ వార్డులో గణతంత్ర దినోత్సవo ఘనంగా నిర్వహించారు. ముందుగా అధ్యక్షులు బొల్లాడ నాగరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. మనకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాజ్యాంగాన్ని రచించడానికి 2సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందన్నారు.1950 జనవరి 26 వ తారీఖున రాజ్యాంగాన్ని ప్రవేశ పెట్టారన్నారు. ప్రతీ సంవత్సరం జనవరి 26 వ తేదీన జాతీయ జెండాను ఎగరవేసి గణతంత్ర దినోత్సవం జరుపుకొంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, సోమసుందర రాజు, పెదమల్లు అవినాష్ కాంత్, గంటా లక్ష్మి, రాసాబత్తుల అనుకుమార్, రేపాక సూర్యరామారావు, కసిరెడ్డి మణిదీప్, బడేటి సాయిరాం, దువ్వాపు శివశంకర్, తణుకు పట్టణ బీజేపీ నాయకులు, వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


