రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఉత్తరాంద్ర పాత 5 జిల్లాలో పర్యాటక ప్రాజెక్ట్ లు చేపట్టేవారిని ఆహ్వానిస్తున్నామని, ఈ మేరకు సుమారు 150 మంది ఇన్వెస్ట్ కు హాజరు కానున్నారని,15 మందితో ఎం.ఓ.యు ఒప్పందం చేసేందుకు అవకాశం ఉందని, అఖండ గోదావరి, గండికోట రు. 170 కోట్లతో అభివృద్ధి చేస్తామని, ఇప్పటికే అన్నవరం టెంపుల్ అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ జరుగుతుందని, అలాగే పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా అహోబిలం, నాగార్జునసాగర్ లను ఒక్కొక్క ప్రాజెక్ట్ కు రు.25 కోట్లతో అభివృద్ధి చేస్తామని, గత ఐదేళ్లలో రాష్ర్టంలో పర్యాటక రంగం అభివృద్ధికి నోచుకోలేదని, నేడు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి పర్యాటకరంగాన్ని మరింత అభివృద్ది చేసే దిశ గా అడుగులు వేస్తున్నారని, త్వరలో రు.100 కోట్లతో సూర్యలంకను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, పరిశ్రమలు స్థాపన మాదిరిగానే పర్యాటక రంగంలో రాయితీలను అందిస్తామని, పర్యాటక రంగం అభివృద్ధి కొరకు పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ భాగస్వామ్యంతో ముందుకు వెళుతున్నామని,రాబోయే రోజుల్లో మారేడుమిల్లి ప్రాంతాన్ని పర్యాటకరంగంలో అభివృద్ధి చేస్తామని, పాపికొండలు విహారయాత్రపై భద్రత ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తామని, రాబోయే ఐదేళ్లలో పర్యాటక రంగాన్ని అగ్రగామిగా తీసుకెళ్లే దిశగా అమరావతి రివర్ ఫ్రంట్ అంత పర్యాటక ప్రాజెక్టు గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా ఉన్నారని, రాష్ట్రంలో పర్యాటకరంగం అభివృద్ధికి గాను తాజ్, ఓబురాయి, ఐఆర్సిటిసి సంస్థలు ముందుకు వస్తున్నాయని, అదేవిధంగా 2025-2029 లో పర్యాటక రంగంలో న్యూ పాలసి తెచ్చామని అన్నారు.


