పశ్చిమ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారు భీమవరం ఎస్.ఆర్.కె.ఆర్. ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లాస్థాయి బాడ్మింటన్ పోటీలను జూలై 17 నుండి జూలై 19 వరకు నిర్వహించగా అందులో తణుకు ఎస్.కె.ఎస్.డి. మహిళా కళాశాల (జూనియర్)కు చెందిన ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని అయిన మానె మనోజ్ఞ (ఎం.పి.సి.) పాల్గొని అండర్-17 బాలికల సింగిల్స్ విభాగంలో విన్నర్ గా, అండర్ 19 బాలికల డబుల్స్ విభాగాల్లో విన్నర్ గా, మరియు అండర్ 19 బాలికల సింగిల్స్ విభాగంలో రన్నర్ గా గెలిచి ప్రశంసా పత్రాలు, ట్రోఫీలను అందుకొని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యిందని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి భూపతిరాజు హిమబిందు తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన అభినందన సభలో కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ శ్రీమతి చిట్టూరి సత్య ఉషారాణి, జాయింట్ సెక్రటరీ చిట్టూరి వెంకట కృష్ణారావు గెలుపొందిన విద్యార్థిని మనోజ్ఞను అభినందిస్తూ తమ కళాశాలలో క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని అలాగే కళాశాలలో అనేక క్రీడాసౌకర్యాలు వున్నాయని వాటిని సద్వినియోగం చేసుకుని ఇంకా బాగా సాధన చేసి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించాలన్నారు. విజేతని కళాశాల ఫిజికల్ డైరెక్టర్ మరియు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.



