దేశ రాజధాని ఢిల్లీ జంతర్మంతర్ వద్ద, దేశ ప్రధాని ఇంటి వద్ద, దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష పేపర్ లీకేజీ కి సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న ధర్నాలు పట్ల ప్రజలు ముఖ్యంగా యువత దృష్టి సారించాలని ఎ.పి.బీజేపీ అధికార ప్రతినిధి డా.ముళ్ళపూడి రేణుక అన్నారు. ఈ సందర్భంగా గురువారం తణుకులో చిట్టూరి హెరిటేజ్ హోటల్ యందు ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ నీట్ పేపర్ల లీకేజీ మాటున విపక్షాలు చేస్తున్న విమర్శలను, విద్యార్థుల సమస్యపై, అఖిలపక్ష సమావేశంలో తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడకుండా రాజకీయ దురుద్దేశంతో పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. ఈ దేశంలో ఉన్న యువతకు అవకాశాలు కల్పించడంలో మన ప్రధాని మోడీ ముందు ఉన్నారని, వారి మేధాశక్తికి, మహిళా సాధికారతకు ఎన్.డి.ఏ ప్రభుత్వం తీసుకువస్తున్న పాలసీల వల్ల మన దేశ యువత ఇటీవల కాలంలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఇద్దరు యువకులు ఇస్రోలో వారి ఉద్యోగాలకు రాజీనామా చేసి స్పేస్ పరిశోధనలకు సంబంధించిన సొంతంగా ఒక స్టార్ట్ అప్ ప్రారంభించి స్కైరూట్ ఏరోస్పేస్ ద్వారా విక్రమ్ శాటిలైట్ ఒన్ ఆర్బిట్ లో విజయవంతంగా పంపించి ప్రపంచ దృష్టిని ఆకర్షించారని, స్పేస్ ఎక్స్ సరసన మన తెలుగు యువత నిలబడ్డారని అన్నారు. మన దేశంలో ఉన్న ప్రభుత్వ విధానాల వల్ల యువత ఏరోనాటికల్, ఏ.ఐ., మెడికల్, ఇంజనీరింగ్ వంటి రంగాల్లో అధ్బుతాలు సృష్టిస్తున్నారని అన్నారు. ఇతర రాష్ట్రాలలో ఆప్, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు పరిపాలనా సమయంలో అనెక సందర్భాలలో ప్రశ్నాపట్రాలు లీక్ అయ్యాయి. కేరళాలో పినరసి విజయన్ ప్రభుత్వ హయాంలో ఒక ప్రభుత్వ పరీక్షలో జవాబు పత్రాలు కూడా వారె ఇచ్చిన సందర్భాలు చూశాము. అలాగే పంజాబ్లో కొన్ని ఎంట్రన్స్ పరీక్షాపత్రాల లీకేజీ చూసాము. దిగ్విజయ్ సింగ్ సి.యం.గా ఉన్న మధ్యప్రదెశ్లో ప్రశ్నాపత్రాల లీకేజీలు చూసాము అన్నారు రేణుక. అదేవిదంగా యువత ముఖ్యంగా తెలుసుకోవాలని సొషల్ మీడియాలో నీట్ పరీక్షపైన వదంతులు వ్యాప్తిచెస్తున్నారని, మే 3న నీట్ పరీక్ష జరిగిన తరువాత, ఎన్.టి.ఏ. కి 7వ తేదీన సమాచారం రాగానే ప్రత్యేక టీం ఏర్పాటు ద్వారా విశ్లేషించుకుని నీట్ రద్దు చేశారని అన్నారు. మే 15న ధర్మేంద్ర ప్రధాన్ ప్రెస్స్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పి, ఇది జరగరాని తప్పిదమని రీ ఎగ్జాం త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారని అన్నారు. తరువాత జరిగిన నీట్ ఎగ్జాం అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించడం పట్ల విద్యార్దులే హర్షం వ్యక్తంచేసారని అన్నారు. ఇప్పటికే సి.బి.ఐ. ఎంక్వైరీ వేసి నిందితులను అరెస్ట్ చేసారని, ఈ ధర్నాలు చేస్తున్న వేదికపై విద్యార్థులు, వారి కుటుంబ సబ్యులు ఎవరూలేరని, అసాంఘికశక్తులు ప్రవేశించి పోలీసులనే గాయపరిచారని అన్నారు.



