తణుకు రోటరీ క్లబ్ కు 20 అవార్డులు

విశాఖపట్నం ఎ.ఎం.టి.జి అతిథులు సంయుక్తంగా నిర్వహించిన కళ్యాణ ప్రశస్థి అవార్డులు ప్రధానం కార్యక్రమం జరిగిన నేపథ్యంలో డిస్ట్రిక్ట్ 3020 స్థాయిలో తణుకు రోటరీ క్లబ్ 18 అవార్డులు సాధించిందని తనకు రోటరీ క్లబ్ కార్యదర్శి జి. సుధాకర్  తెలియజేశారు. విశాఖపట్నంలో జరిగిన అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ఉత్తమ రోటరీ అధ్యక్షులు ఉత్తమ కార్యదర్శి బహుమతులతో పాటు 18 అవార్డులు గెలుచుకున్న అతిపెద్ద రోటరీ క్లబ్ గా  తణుకు  నిలవడంతో తణుకు రోటరీ క్లబ్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పత్రిక ప్రకటనలో రోటరీ క్లబ్ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ కార్యదర్శి జి సుధాకర్ తణుకు రోటరీ క్లబ్ ఈ స్థాయి అవార్డును సాధించడానికి తోడ్పడిన రోటరీ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా వైస్. ప్రెసిడెంట్ కటారి సిద్ధార్థ రాజు, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఏ. దినేష్ బాబు, ట్రెజరర్ ఎం. వెంకటేశ్వరరావు, సర్వీస్ ప్రాజెక్ట్ చైర్పర్సన్ పోతుల శ్రీనివాసరావు, సీనియర్ రోటరీ క్లబ్ సభ్యులు ఎమ్ అరుణ సారథి, జేయస్. సుబ్రహ్మణ్యం, కే. సత్యనారాయణ రాజు, సింహాద్రి విహారి, అక్కిన కాశీ విశ్వనాథం, ఉద్దరాజు పవన్ కుమార్ రాజు, ఆనందం మస్తాన్రావు తదితరులు రోటరీ క్లబ్ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

Scroll to Top
Share via
Copy link