కారుమూరి…. కారు కూతలు మానుకో

రాజకీయాల్లో చౌకబారు వ్యాఖ్యలు సరికాదు

భవిష్యత్తుపై భయంతోనే కారుమూరి వ్యాఖ్యలు

కులాలపై చిచ్చులు పెట్టిన మాజీ మంత్రి కారుమూరి

కారుమూరిపై మండిపడిన తణుకు తెలుగుదేశం పార్టీ నేతలు

రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసి కిందిస్థాయి కార్యకర్తలు, నాయకులకు ఆదర్శంగా ఉండాల్సిన మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు మండిపడ్డారు. సోమవారం తణుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడారు. భవిష్యత్తుపై భయంతోనే కారుమూరి కారు కూతలు కూస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి పితాని మోహనరావు మాట్లాడుతూ తణుకు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బీసీ నాయకుడవై ఉండి గ్రామాల్లో బీసీలకు చేసిన ఉపకారం ఏంటని ప్రశ్నించారు. గత వైసిపి ప్రభుత్వం హయాంలో ప్రతి లబ్ధిదారుడి దగ్గర రూ. 30 వేలు చొప్పున ఇళ్ల స్థలాల కోసం వసూలు చేసిన విషయం మర్చిపోయారా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. గత ఐదేళ్ల కాలంలో చేసిన దందాలు అక్రమాలు మరిచిపోయి అధికార పార్టీ నాయకులపై బురదజల్లేందుకు ప్రయత్నించడం సమంజసం కాదన్నారు. రూ. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల కాలంలో రూ.2 వేల కోట్లతో అభివృద్ధి, సంక్షేమం అమలు చేశామని అంకెలతో సహా చెబుతున్నారని గుర్తు చేశారు. తణుకు ఏఎంసి వైస్ చైర్మన్ వల్లూరి మోహన్ మాట్లాడుతూ కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. కుటుంబాల మధ్య సైతం కలహాలు సృష్టించే విధంగా కారుమూరి చేసిన కుట్రలు నిజం కాదా అని ప్రశ్నించారు. రూ. 600 కోట్లతో వేల్పూరు గ్రామాన్ని అభివృద్ధి చేశామని చెబుతున్న కారుమూరి ఎక్కడ అభివృద్ధి చేశారు లెక్కలు చూపించాలని కోరారు. వీధి స్థాయి నాయకుడి కన్నా దిగజారి చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. వేల్పూరు గ్రామానికి మణిహారంగా వేల్పూరు మినీ బైపాస్ నిర్మాణం చేపట్టామని గుర్తు చేశారు. తణుకు మాజీ వార్డు కౌన్సిలర్ మళ్లిన రాధాకృష్ణ మాట్లాడుతూ పోలీసు చట్టాలను ఉల్లంఘించినందుకు 38 మంది వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేస్తే అందుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ కారణం అంటూ చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఎంతోమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేయించిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. తనపై సైతం హత్య ఆరోపణలు చేస్తూ కేసులను నమోదు చేయించిన విషయం ఇంకా మర్చిపోలేదని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే రాధాకృష్ణపై ఎన్నో కేసులు నమోదు చేయించారని చెప్పారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Scroll to Top
Share via
Copy link