నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండ్రాజవరం గ్రామ మాజీ సర్పంచ్, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ బోర్డు మెంబర్ గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం జన్మదినం సందర్భంగా ఉండ్రాజవరం ఎస్సీ యూత్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించి, వివిధ ప్రదేశాల్లో నిరాశ్రయులైన పేదలకు స్పందన ఆశ్రమంలో వికలాంగులకు ఉచిత ఆహార పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా తమ కుటుంబాన్ని ఆదరిస్తూ రాజకీయంగా తమ వెంట నడుస్తున్న అభిమానులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా యువకులు అన్నదానాలు, చలివేంద్రాలు నిర్వహించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ యూత్ సభ్యులైన కోట వెంకట్రావు, పెనుమాల నాగేశ్వరరావు, కుంచె కాంతారావు, పోలుమాటి వెంకటనర్సయ్య, గుమ్మడి నిరంజన్, నీరుళ్ళ వీరాస్వామి, కుంచే సంజయ్ భార్గవ్, గురజా వినయ్, గుమ్మడి ప్రసాద్, గుమ్మడి పెద్దిరాజు, గుమ్మడి శ్రీను, నల్లి దానయ్య, డొల్లా రమేష్, కప్పల బుల్లి అబ్బులు తదితరులు పాల్గొన్నారు.



