తణుకు రామకృష్ణ సేవాసమితిలో గోపి మామ మ్యాజిక్ షో.

తణుకు రామకృష్ణ సేవాసమితిలో వివేకానంద హ్యూమన్ ఎక్స్ లెన్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల ఒకటో తేదీ నుండి జరుగుతున్న వేసవి శిక్షణా శిబిరంలో భాగంగా ఈరోజు గోపి మామగా పిలవబడే ప్రముఖ సైంటిఫిక్ మెజీషియన్ మరియు మోటివేషనల్ ట్రైనర్ బి.ఎం. గోపాల రెడ్డి చే మ్యాజిక్ మోటివేషన్ క్లాస్ జరిగినది. గోపాల్ రెడ్డి తన మ్యాజిక్ ద్వారా మంచి అలవాట్లు, సెల్ ఫోన్ వల్ల లాభ నష్టాలు, క్రమశిక్షణ, ఓజోన్ పొర గురించి మరియు దేశభక్తిని పెంపొందించే ఇంద్రజాల ప్రదర్శనలతో అందరినీ అలరింపజేశారు ఆలోచింపజేశారు. సుమారు 120 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్లు గిరీశ్వరరావు, అక్కింశెట్టి రాంబాబు, రవీంద్ర, రామకృష్ణ, ఇందిర, లోహిత, తేజోమయి, మణి, అశోక్ రెడ్డి, శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link