మహాప్రస్థానం నిత్యవసంతం…!

సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక పంచాయితీ రాజ్ ప్రాంగణమందు శ్రీశ్రీ జయంతిని గురువారం నిర్వహించినారు.
సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ చెప్పలేని భావలను కలంతో చెప్పడం శ్రీశ్రీ కి అలవాటని, కలం నుంచి జాలువారిన అక్షరాలెన్నో ఎంతోమంది గుండెల్లో నిలిచాయని అన్నారు. పంచాయితీ రాజ్ డి. ఇ. ఇ. ఉప్పలపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహాప్రస్థానం నిత్యవసంతమని, మనలోనికవి, మహాకవి శ్రీశ్రీ అని అన్నారు. పై సందర్భంగా శీశ్రీ జీవితచరిత్రపై సదస్సు నిర్వహించినారు పలువురు మాట్లాడినారు.
అనంతరం పంచాయితీ రాజ్ డి. ఇ. ఇ. ఉప్పలపాటి శ్రీనివాసరావును, ఏ. ఇ. ఇ. మేడిది నీల్ ఆల్ స్టీన్ ను నిర్వాహకులు ఘనంగా సత్కరించినారు.
ఇంకా ఈకార్యక్రమంలో ఆఫీస్ సిబ్బంది గొట్టుముక్కల సూసన్ ఎలినోర్, బుడితి సుధారాణి ఇతరులు ముక్కామల మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link