రాష్ట్రంలోనే ఉత్తమ సేవలు అందిస్తున్న ఏలేటిపాడు సొసైటీ

కూటమి నాయకుల సహకారంతో అభివృద్ధి

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి

రైస్ మిల్లు డ్రయర్ ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ

రాష్ట్రంలోనే రైతులకు ఉత్తమ సేవలు అందిస్తున్న ఏలేటిపాడు సొసైటీ దినదినాభివృద్ధి చెందడం అభినందనీయమని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఇరగవరం మండలం ఏలేటిపాడు సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైస్ మిల్లులో రూ. కోటి వ్యయంతో నిర్మించిన డ్రయర్ నిర్మాణాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. రైతుల సహకారంతో ఏలేటిపాడు సొసైటీను రాష్ట్రంలోనే ఉత్తమ సొసైటీగా గుర్తింపు సాధించడం అభినందనీయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం సొసైటీకు సహకారం అందించడంతోపాటు సొసైటీ అధ్యక్షులు విశ్వేశ్వర రెడ్డి సహకారంతో దినదినాభివృద్ధి చేసే విధంగా సొసైటీను ముందుకు తీసుకువెళ్లడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సొసైటీకు పెట్రోల్ బంకు మంజూరు చేయడం జరిగిందని రైస్ మిల్లుకు శంకుస్థాపన చేసి నిర్మాణం ప్రారంభించుకోవడం జరిగిందని చెప్పారు. వ్యవస్థలు బాగా పనిచేస్తుంటే ప్రోత్సహించే నాయకత్వం, అధికారులు ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలాంటి ప్రోత్సాహం రెవెన్యూ, సొసైటీ అధికారులు అందించడం అభినందనీయమని అన్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా తాను రైతులకు కావలసిన ప్రయోజనాలను అందించే విధంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ముందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. రైతులకు తేమశాతంతో ఇబ్బంది లేకుండా దాన్యం విక్రయించుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. విశ్వేశ్వర రెడ్డి సైతం సొసైటీ అభివృద్ధికి నిబద్ధతతో కూటమి నాయకుల సహకారంతో పనిచేయడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు. 2014- 19 సమయంలో అప్పటి ఎమ్మెల్యేగా తాను పనిచేసిన సమయంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో వైసిపి అధికారంలో ఉండగా ఎలాంటి కష్టాలు ఇబ్బందులు ఎదురయ్యాయో ప్రజలు బేరీజు చేసుకోవాలని కోరారు. ఎరువులు కొరత ఉందంటూ వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఎరువులు ఇబ్బంది లేకుండా రైతులకు ప్రణాళిక ప్రకారం వారికి అందుబాటులోకి తీసుకువచ్చిన పరిస్థితి ఉందని చెప్పారు. అవసరమైనంతవరకు ఎరువులు అందుబాటులోకి తీసుకువచ్చి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని గుర్తు చేశారు. ధాన్యం డబ్బులు సైతం 24 నుంచి 48 గంటల్లోపు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link