తణుకులో చెత్త నుంచి కంపోస్ట్ తయారీకు ప్రణాళికలు సిద్ధం
రూ. 4 కోట్లు వ్యయంతో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు సన్నాహాలు
స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం
తణుకులో పర్యటించిన కొమ్మారెడ్డి పట్టాభిరాం
రాబోయే రోజుల్లో స్వచ్ఛ తణుకు నియోజకవర్గం ఏర్పాటు దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. మంగళవారం తణుకు విచ్చేసిన పట్టాభిరామ్ స్వర్ణాంధ్ర స్వచ్ఛందర ద్వారా చేపట్టిన వివిధ ప్రాజెక్టులను ఆయన పరిశీలించి మాట్లాడారు. గత ప్రభుత్వం బదిలీ వెళ్ళిన లక్షలాది టన్నుల కూటమి ప్రభుత్వం తొలగిస్తుందని చెప్పారు. తణుకు పట్టణంలో రూ. 4 కోట్ల వ్యయంతో ఎమ్మెల్యే రాధాకృష్ణ సహకారంతో రెండు ఎకరాల స్థలంలో ప్రాసెసింగ్ యూనిట్ త్వరలో ప్రారంభించినట్లు తెలిపారు. తణుకు పట్టణంలో డంపింగ్ యార్డు లేకుండా స్వచ్ఛాంధ్ర ప్రాసెసింగ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏ రోజు చెత్త ఆరోజు ప్రాసెస్ చేసే విధంగా చర్యలు చేపడతామన్నారు. చెత్త నుంచి ఉత్పత్తి అయ్యే కంపోస్టు మార్క్ ఫెడ్ ద్వారా మార్కెటింగ్ చేసి పది శాతం ఆదాయాన్ని తణుకు మున్సిపాలిటీకి దక్కే విధంగా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం అత్తిలి, ఇరగవరం,లతణుకు మండలాల పరిధిలో రూ. 9.60 కోట్లు వ్యయంతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా తోపుడు బళ్ళు, మూడు చక్రాల వాహనాలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టామని అన్నారు. అత్తిలి మండలంలో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టామని అన్నారు. అర్బన్, రూరల్ ప్రాంతాల్లో డోర్ టు డోర్ కలెక్షన్ మెరుగుపరిచేందుకు ప్రణాళికలు మరింత మెరుగుగా చేపట్టినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. గతంలో స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తణుకు పట్టణాన్ని సందర్శించడంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, కూటమి నాయకులు పాల్గొన్నారు.


