సోమవారం అత్తిలి మండలంలో అత్తిలి పిఎసిఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అత్తిలి సొసైటీ చైర్మన్ పోలిశెట్టి గోపి, అత్తిలి మండల టిడిపి ప్రెసిడెంట్ పోలిశెట్టి చందు, ఎంపీపీ మక్కా సూర్యనారాయణ, డి.సి. చైర్మన్ సురేష్, సత్యనారాయణ, బిజెపి మండల ప్రెసిడెంట్ నాగబాబు, అత్తిలి టౌన్ టిడిపి టౌన్ ప్రెసిడెంట్ కోరిపల్లి ప్రసాద్, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు.
రైతులందరూ కూడా వారు పండించిన ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా విక్రయించుకోవాలని ధాన్యం విక్రయించిన రైతులందరికీ ధాన్యం అమ్మిన 24 గంటల్లోపు నగదు జమవుతుందని అలాగే రైతుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ ద్వారా మూడు విడతలగా 20000 రూపాయలు రైతులకు నేరుగా నగదు చేయడం జరుగుతుందని, యూరియా సప్లై విషయంలో గాని అలాగే కాలువల పనులు నిమిత్తం గాని ప్రత్యేక శ్రద్ధ పెట్టి రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తుందని నాయకులు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో దసిక వంశి సుబ్రహ్మణ్యేశ్వర, వ్యవసాయ అధికారి తమ్మ రాజేష్, సివిల్ సప్లై డి.టి. మురళీకృష్ణ , గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు రైతులు పాల్గొన్నారు.


