అణగారిన వర్గాల అభ్యున్నతికోసం కృషి చేసిన పూలే

సామాజిక న్యాయం కోసం చేసిన సేవలు చిరస్మరణీయం

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి

తణుకులో ఘనంగా పూలే 199వ జయంతి వేడుకలు
అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు జ్యోతిరావు పూలే అని తణుకు ఎమ్మెల్యే ఆరుమెల్లి రాధాకృష్ణ అన్నారు. జ్యోతిరావు పూలే 199వ జయంతి పురస్కరించుకొని శనివారం తణుకులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళల విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు ‘సత్యశోధక సమాజ్’ స్థాపించి సమాజంలో మార్పు తీసుకువచ్చారని కొనియాడారు. అనేక సామాజిక ఉద్యమాలకు ఊపిరి పోసిన వ్యక్తి పూలే అని పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సైతం జ్యోతిరావు పూలేను తన గురువుగా ప్రకటించడం విశేషమని అన్నారు. విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో ముఖ్యంగా మహిళలు, బాలికలకు విద్య అందించాలని సంకల్పంతో బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు నిర్మించిన మహనీయుడు అని పేర్కొన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సైతం ఆయన ఆశయాలకు అనుగుణంగా బీసీల అభివృద్ధి కోసం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. విద్య, ఉపాధి, ఆర్థికంగా బలపడేలా అనేక పథకాలను అమలు చేస్తోంద న్నారు. అలాంటి మహనీయుడి ఆశయాలను మనం అందరం అనుసరించి సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలి అని పేర్కొన్నారు. కులాల మధ్య ఐక్యత ఉండాలని వర్గవైషమ్యాలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆయన రచనలు సమాజాన్ని ఉత్తేజపరిచేయమని గుర్తు చేశారు. సమ సమాజ స్థాపనకు పనిచేసి ప్రపంచానికి చాటి చెప్పడం అభినందనీయమని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం పరిపాటిగా మారేదని అన్నారు. ప్రస్తుతం కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు అండగా ఉంటూ వారి సంక్షేమానికి పాటుపడుతోందని అన్నారు. అంతకుముందు పూలే విగ్రహానికి ఎమ్మెల్యే రాధాకృష్ణ పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీసీ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link