ఆకివీడు దళితులపై పెట్టిన అక్రమకేసులు ఎత్తివేయాలి – బిఎస్పి

బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఉండ్రాజవరం లూథరన్ చర్చి వద్ద నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్ కార్యాలయం వద్ద వినతి పత్రం అందించారు.ఈ సందర్బంగా బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేట దళితులపై కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆకివీడు దళితులకు, స్థానిక హిందువులకు ఎటువంటి విభేదాలు లేవు అని, అక్కడి ప్రజలు అన్నదమ్ములులా బ్రతికేవారని, ఉండి ఎమ్మెల్యే రఘు రామకృష్ణంరాజు వ్యక్తిగత ప్రయోజనాల కోసం, దళితుల పై అతనికి సహజంగా, వ్యక్తిగతంగా ఉండే వ్యతిరేక వల్ల, మతపరమైన విభేదాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించి, శ్రీరామనవమి రోజున 200 మంది స్థానికేతరులను వెంటపెట్టుకొని ఆకివీడు దళితపేటలో ప్రవేశించి గొడవలు సృష్టించినందుకు అతని పైన, అతని అనుచరులు పైన కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంతకు ముందే అక్కడ శాంతిభద్రతల సమస్య ఉన్నపుడు కూటమి ప్రభుత్వం అతనిని ఎందుకు వెళ్ళనిచ్చిందని ప్రశ్నించారు. పెదపేట పై దాడులకు కుట్ర పన్నిన రఘురామకృష్ణంరాజు శ్రీరామనవమి జరగడానికి ముందు నుండి అనేక మందితో రోజూ ఫోన్ లో సంప్రదింపులు జరిపి ఆకివీడుకి సంభందం లేని వ్యక్తులను ఆకివీడు పెదపేటకి రప్పించడం వెనుక కుట్ర ఉందని, ఈ కుట్ర బయట పడాలంటే, అతని కాల్ డేటా పై విచారణ జరిపి దోషులను శిక్షించాలని, కూటమి ప్రభుత్వం పదే పదే రఘురామకృష్ణంరాజు పై దాడి జరిగిందని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, అన్ని వందల మంది పోలీసులు ఉండగా అదెలా సాధ్యం అని ప్రశ్నించారు. రఘురామకృష్ణంరాజు డాడీ జరిగిన వీడియో ఒక్కటి అయినా నేటి వరకు ప్రభుత్వం ఎందుకు బయట పెట్టలేదని నిలదీశారు.

65 మంది దళితులపై హత్యప్రయత్నం ఆరోపణలు చేస్తూ కఠిన మైన కేసులు నమోదు చేసి జైలుకు పంపారని, కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టుగా మరణాయుధాలతో దాడి చేస్తే ఆ రోజు నాటి వీడియో లు ప్రభుత్వం ఎందుకు విడుదల చేయలేదని నిలదీశారు. కూటమి ప్రభుత్వం ఏక పక్షంగా వ్యహరించి, పేట మీదకి దాడికి వచ్చిన 200 మంది పై ఎటువంటి కేసులు నమోదు చేయకుండా, తమ నివాసాల మధ్యన, తమ ఇంట్లో ఉన్నవారి పైన అన్యాయంగా కేసులు మోపి వేదిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకివీడు ఘటన పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, ఆకివీడు దళితులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుమ్మాపు చిత్రసేను, పట్నల విజయకుమార్, మర్రి మహాలక్ష్ముడు, బత్తిన. ఆశీర్వాదం, బయ్యే మునీంద్ర, షారోను రాజు, కత్తుల ప్రకాష్, డోల్ల జాషువా, నల్లి రమేష్ బాబు, చల్లబత్తుల సత్యనారాయణ, గుమ్మళ్ళ రవికుమార్, గొల్ల ధనరాజు, నూకపెయ్యి ప్రసన్న కుమార్, మొసలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

Scroll to Top
Share via
Copy link